Government of Andhra Pradesh
Andhra Pradesh Government
School Education Department
District Educational Office Kurnool

District Education Portal

Information, circulars, and school services for Kurnool district

Access official notices, department updates, teacher resources, useful government links, and recent education announcements from one responsive portal.

01Know Your SchoolSearch; School Name; UDISE Code; PIN Code 02Mid-Day MealDokka Seethamma - Mid- Day Meal Scheme 03APMSModel Schools Scheme 04G.O. SearchOfficial government orders

Photo Gallery

District education highlights

Photo 1Upload or paste image here
Photo 2Upload or paste image here
Photo 3Upload or paste image here
Photo 4Upload or paste image here
Photo 5Upload or paste image here

Public Resources

Use the sidebar links for board, SCERT, NCERT, Gazette, and district education resources.

Showing posts with label 2026. Show all posts
Showing posts with label 2026. Show all posts

Saturday, November 7, 2026

Draft Seniority List of Junior Office Asst (Jr.Asst & Typist), Record Asst and Class-IV Employees for Allocation under AP Presidential Order 2025 – Erstwhile Kurnool Dist As on 07-11-2026

జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము, కర్నూలు
Draft Seniority List of Junior Office Asst (Jr.Asst & Typist), Record Asst and Class-IV Employees for Allocation under AP Presidential Order 2025 – Erstwhile Kurnool Dist As on 07-11-2026
(Non-Teaching Staff – Objections Called)
ఉత్తర్వులు

Rc.No. 2922/A4/2026, Dated: 07-11-2026

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్లు (జూనియర్ అసిస్టెంట్ & టైపిస్ట్), రికార్డ్ అసిస్టెంట్లు మరియు క్లాస్-IV ఉద్యోగుల (ఆఫీస్ సబార్డినేట్, నైట్ వాచ్‌మెన్, స్వీపర్, వాటర్‌మెన్) డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితాను సంబంధిత ప్రధానోపాధ్యాయులు / DDOలు / సంస్థల అధిపతుల ద్వారా అందరికీ తెలియజేయడమైనది.

సదరు డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్, 2025 మరియు దాని కింద జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులను సంబంధిత లోకల్ క్యాడర్లకు కేటాయించే ఉద్దేశ్యంతో మాత్రమే రూపొందించబడినది. దీనిని సంబంధిత ఉద్యోగుల రెగ్యులర్ / సర్వీస్ సీనియారిటీని నిర్ణయించినట్లు లేదా ఖరారు చేసినట్లు భావించరాదు.

సంబంధిత ఉద్యోగులు తమ అభ్యంతరాలు / సవరణలు ఏవైనా ఉన్నట్లయితే, ఈ ఉత్తర్వులు అందిన తేదీ నుండి ఐదు (5) రోజుల లోపు తప్పనిసరిగా Proper Channel ద్వారా సమర్పించవలెను.

నిర్ణీత గడువులోగా ఎటువంటి అభ్యంతరాలు / సవరణలు అందని పక్షంలో, ఎటువంటి అభ్యంతరాలు లేవని భావించి, అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా Presidential Order, 2025 కింద లోకల్ క్యాడర్ల కేటాయింపు నిమిత్తం డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితా ఖరారు చేయబడును.

జాబితాలోని కేడర్లు

S.No.Name of the Post
1Junior Assistant
2Typist (Junior Office Asst)
3Record Assistant
4Office Subordinate
5Night Watchmen
6Sweeper
7Waterman

Download

This should be treated as Most Important. సంబంధిత ప్రధానోపాధ్యాయులు / DDOలు / సంస్థల అధిపతులు ఈ ఉత్తర్వులను తమ పరిధిలోని ఉద్యోగులకు తెలియజేసి, అందినట్లు ధృవీకరించవలెను.

Sd/- L. SUDHAKAR
జిల్లా విద్యాశాఖాధికారి (FAC),
ఉమ్మడి కర్నూలు జిల్లా.

HMs and MEOs Seniority List for Allocation of Employees under AP Presidential Order 2025 – Kurnool Dist As on 07-11-2026 (All Managements)

AP Presidential Order 2025 | కర్నూలు జిల్లా
HMs & MEOs డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితాలు
అన్ని యాజమాన్యాలు | తేదీ: 07-11-2026
అభ్యంతరాలకు గడువు
08-11-2026 సా. 5 గం.

కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న గ్రేడ్-II ప్రధానోపాధ్యాయులు (Govt / ZPP / MPP / మున్సిపల్ / మున్సిపల్ కార్పొరేషన్), మండల విద్యాశాఖాధికారులు (MEO-I, MEO-II), DIET సీనియర్ లెక్చరర్లు మరియు లెక్చరర్ల డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితాలను జిల్లా విద్యాశాఖాధికారి, కర్నూలు వారు 07-11-2026 న పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఈ జాబితాలను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, అమరావతి వారు తయారు చేసి, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (RJD), కడప ద్వారా జిల్లా కార్యాలయానికి పంపారు.

ఈ జాబితాలు AP Public Employment (Organisation of Local Cadres and Regulation of Direct Recruitment) Order, 2025 మరియు దాని మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులను సంబంధిత స్థానిక క్యాడర్లకు కేటాయించే (Allocation) ఉద్దేశ్యంతో మాత్రమే తయారు చేశారు.

ముఖ్య గమనిక: ఈ జాబితాలు కేవలం లోకల్ క్యాడర్ కేటాయింపు కోసమే. వీటిని మీ సాధారణ సర్వీసు సీనియారిటీని నిర్ణయించినట్లుగా లేదా ఖరారు చేసినట్లుగా భావించకూడదు

సీనియారిటీ జాబితాలు డౌన్‌లోడ్ (Excel)

మీకు సంబంధించిన కేడర్ / యాజమాన్యం జాబితాను క్రింది లింకుల ద్వారా తెరిచి, మీ పేరు, CFMS ID, పుట్టిన తేదీ, ఆ కేడర్‌లో చేరిన తేదీ, కేటగిరీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో తప్పకుండా చూసుకోండి.

క్ర.సం.కేడర్ / యాజమాన్యంపరిధిలింక్
1ZP / MPP HM Gr-IIకర్నూలుడౌన్‌లోడ్
2Municipal HM Gr-IIకర్నూలుడౌన్‌లోడ్
3Municipal Corporation HM Gr-IIకర్నూలుడౌన్‌లోడ్
4Govt HM Gr-IIజోన్-IVడౌన్‌లోడ్
5ZP MEO-Iకర్నూలుడౌన్‌లోడ్
6Govt MEO-Iజోన్-IVడౌన్‌లోడ్
7MEO-IIకర్నూలుడౌన్‌లోడ్
8DIET సీనియర్ లెక్చరర్లు / లెక్చరర్లుకన్సాలిడేటెడ్డౌన్‌లోడ్

* Govt HM Gr-II మరియు Govt MEO-I కేడర్లు జోన్ స్థాయి కేడర్లు కాబట్టి, ఆ జాబితాలు జోన్-IV మొత్తానికి ఒకే జాబితాగా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఉద్యోగుల పేర్లు కూడా అందులోనే ఉంటాయి.

గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలు / సవరణలు / అప్పీళ్లు ఏ పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబడవు. ఎలాంటి అభ్యంతరం తెలపని వారి సీనియారిటీ సరైనదిగా భావించబడుతుంది.