08-11-2026 సా. 5 గం.
కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న గ్రేడ్-II ప్రధానోపాధ్యాయులు (Govt / ZPP / MPP / మున్సిపల్ / మున్సిపల్ కార్పొరేషన్), మండల విద్యాశాఖాధికారులు (MEO-I, MEO-II), DIET సీనియర్ లెక్చరర్లు మరియు లెక్చరర్ల డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితాలను జిల్లా విద్యాశాఖాధికారి, కర్నూలు వారు 07-11-2026 న పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఈ జాబితాలను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, అమరావతి వారు తయారు చేసి, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (RJD), కడప ద్వారా జిల్లా కార్యాలయానికి పంపారు.
ఈ జాబితాలు AP Public Employment (Organisation of Local Cadres and Regulation of Direct Recruitment) Order, 2025 మరియు దాని మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులను సంబంధిత స్థానిక క్యాడర్లకు కేటాయించే (Allocation) ఉద్దేశ్యంతో మాత్రమే తయారు చేశారు.
సీనియారిటీ జాబితాలు డౌన్లోడ్ (Excel)
మీకు సంబంధించిన కేడర్ / యాజమాన్యం జాబితాను క్రింది లింకుల ద్వారా తెరిచి, మీ పేరు, CFMS ID, పుట్టిన తేదీ, ఆ కేడర్లో చేరిన తేదీ, కేటగిరీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో తప్పకుండా చూసుకోండి.
| క్ర.సం. | కేడర్ / యాజమాన్యం | పరిధి | లింక్ |
|---|---|---|---|
| 1 | ZP / MPP HM Gr-II | కర్నూలు | డౌన్లోడ్ |
| 2 | Municipal HM Gr-II | కర్నూలు | డౌన్లోడ్ |
| 3 | Municipal Corporation HM Gr-II | కర్నూలు | డౌన్లోడ్ |
| 4 | Govt HM Gr-II | జోన్-IV | డౌన్లోడ్ |
| 5 | ZP MEO-I | కర్నూలు | డౌన్లోడ్ |
| 6 | Govt MEO-I | జోన్-IV | డౌన్లోడ్ |
| 7 | MEO-II | కర్నూలు | డౌన్లోడ్ |
| 8 | DIET సీనియర్ లెక్చరర్లు / లెక్చరర్లు | కన్సాలిడేటెడ్ | డౌన్లోడ్ |
* Govt HM Gr-II మరియు Govt MEO-I కేడర్లు జోన్ స్థాయి కేడర్లు కాబట్టి, ఆ జాబితాలు జోన్-IV మొత్తానికి ఒకే జాబితాగా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఉద్యోగుల పేర్లు కూడా అందులోనే ఉంటాయి.
No comments:
Post a Comment