Rc.No. 2922/A4/2026, Dated: 07-11-2026
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్లు (జూనియర్ అసిస్టెంట్ & టైపిస్ట్), రికార్డ్ అసిస్టెంట్లు మరియు క్లాస్-IV ఉద్యోగుల (ఆఫీస్ సబార్డినేట్, నైట్ వాచ్‌మెన్, స్వీపర్, వాటర్‌మెన్) డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితాను సంబంధిత ప్రధానోపాధ్యాయులు / DDOలు / సంస్థల అధిపతుల ద్వారా అందరికీ తెలియజేయడమైనది.
సదరు డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్, 2025 మరియు దాని కింద జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులను సంబంధిత లోకల్ క్యాడర్లకు కేటాయించే ఉద్దేశ్యంతో మాత్రమే రూపొందించబడినది. దీనిని సంబంధిత ఉద్యోగుల రెగ్యులర్ / సర్వీస్ సీనియారిటీని నిర్ణయించినట్లు లేదా ఖరారు చేసినట్లు భావించరాదు.
నిర్ణీత గడువులోగా ఎటువంటి అభ్యంతరాలు / సవరణలు అందని పక్షంలో, ఎటువంటి అభ్యంతరాలు లేవని భావించి, అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా Presidential Order, 2025 కింద లోకల్ క్యాడర్ల కేటాయింపు నిమిత్తం డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితా ఖరారు చేయబడును.
జాబితాలోని కేడర్లు
| S.No. | Name of the Post |
|---|---|
| 1 | Junior Assistant |
| 2 | Typist (Junior Office Asst) |
| 3 | Record Assistant |
| 4 | Office Subordinate |
| 5 | Night Watchmen |
| 6 | Sweeper |
| 7 | Waterman |
Download
This should be treated as Most Important. సంబంధిత ప్రధానోపాధ్యాయులు / DDOలు / సంస్థల అధిపతులు ఈ ఉత్తర్వులను తమ పరిధిలోని ఉద్యోగులకు తెలియజేసి, అందినట్లు ధృవీకరించవలెను.
జిల్లా విద్యాశాఖాధికారి (FAC),
ఉమ్మడి కర్నూలు జిల్లా.